కల్కి సినిమాలో భైరవగా కనిపించనున్నాడు ప్రభాస్. భైరవకి తోడుగా రోబోటిక్ అనే బుజ్జి కార్ కూడా సినిమాలో కీ రోల్ ప్లే చేయనుంది. అయితే.. భైరవ గర్ల్‌ఫ్రెండ్‌గా మాత్రం హాట్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది. ఆమె పేరెంటో తెలుసా?
Do you know the parents of Bhairava's girlfriend in 'Kalki'?
Kalki: కల్కి సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే మెయిన్ లీడ్‌లో నటిస్తుండగా.. దిశా పటానీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. ట్రైలర్లో దీపికను గర్భవతిగా చూపించాడు నాగ్ అశ్విన్. ఆమెనే కల్కికి జన్మనిస్తుందని.. కల్కి బాధ్యతలను అశ్వద్ధామ తీసుకుంటాడని ట్రైరల్లో చూపించారు. అయితే.. దిశా పటానీని మాత్రం భైరవ గర్ల్ ఫ్రెండ్‌గా చూపించారు. లేటెస్ట్గా ఆమె క్యారెక్టర్ పేరు రాక్సీ అంటూ.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలో ఆమె రాక్సీ అనే పాత్రలో కనిపించనున్నట్టుగా తెలిపారు. జూన్ 13 దిశా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, ఆమె పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో.. దిశా కిర్రాక్ లుక్‌లో కనిపిస్తోంది. నడుము అందాలు చూపిస్తూ.. గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అన్నట్టుగా ఉంది.
మామూలుగానే దిశా పటానీ సోషల్ మీడియాను హాట్ హాట్ ఫోటో షూట్లతో హీటెక్కిస్తుంటుంది. అలాంటి బ్యూటీని కల్కిలో వాడుకోవాలే గానీ, ఆ హాట్నెస్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్, దిశా పటానీలపై అదిరిపోయే మాస్ సాంగ్ డిజైన్ చేశారు. ఈ పాటను ఇటలీలో షూట్ చేశారు. ఈ సాంగ్‌లో భైరవ, రాక్సీ చించేశారని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఇక 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ సినిమాతో దిశా పటానీ హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి, అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంది. ఇక ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే.. సూర్య సరసన కంగువ సినిమాలోను నటిస్తోంది. మరి దిశా పటానీకి ఈ సినిమాలు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడతాయో చూడాలి.