ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బావిలో చిక్కుకున్న ఓ నాగుపామును కాపాడాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి భయ్యా.. ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు. నీ ప్రాణాలను పణంగా పెట్టి ఆ పామును రక్షించాల్సిన అవసరం ఉందా? నీ ప్రాణాలు ముఖ్యం కదా అంటూ మనోడికి క్లాస్ పీకే ప్రయత్నం చేశారు.
నిజానికి ఆ యువకులు చాలా రిస్క్ చేశాడు. బావిలో చాలా నీళ్లు ఉన్నాయి. తాడు కట్టుకొని బావి మధ్యలోకి దిగి ఆ పామును పట్టుకొని సంచిలో వేసేందుకు చాలా ప్రయత్నించాడు. ఆ పాము సంచిలోకి వెళ్లకుండా బుసలు కొడుతూ అతడి మీదికి రాబోయింది. ఏమాత్రం అటూ ఇటూ అయినా ఆ పాము కాటుకి గురయ్యేవాడు. మొత్తానికి ఎంతో రిస్క్ చేసి ఆ పాము ప్రాణాలు కాపాడిన ఆ యువకుడిని నెటిజన్లు, స్థానికులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.