ఎన్నో పోషకాల పవర్ హౌస్ అని నెయ్యిని చెబుతారు. అయితే దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతారని భయపడి చాలా మంది దీన్ని తినడం మానేస్తుంటారు. మరి అసలు ఇందులో నిజం ఎంత? అపోహ ఎంత? అనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
Ghee : చాలా మంది భోజనంలో నెయ్యి వేసుకుని తినేందుకు ఇష్టపడతారు. అది ఆహారానికి అదనపు రుచిని జోడిస్తుందనడంలో సందేహం లేదు. అయితే దీన్ని తినడం వల్ల అనసరంగా బరువు పెరుగుతారని ఓ అపోహ చాలా మందిలో ఉంది. అయితే దీనిలో అసలు నిజం ఎంత? దీన్ని తినడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? తెలుసుకుందాం రండి.
నెయ్యిని(Ghee) రోజుకు ఒక టీ స్పూన్ వరకు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల బరువు పెరగడం కాదు.. బరువు తగ్గే అవకాశాలు ఉంటాయంటున్నారు. అలాగే ఇది ఇచ్చే శక్తి వల్ల రోజంతా చురుగ్గా ఉండి పనులను చక్కబెట్టుకోవచ్చు. ఇంకా మన చర్మం నిగారింపుగా ఉండాలంటే దానికి యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు అవసరం. అలాంటివన్నీ దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్లా పని చేస్తుంది. ముఖం నిగారింపుగా ఉండేలా చేస్తుంది.
హార్మోన్ల అసమతుల్యను సరి చేయడంలో నెయ్యి(Ghee) సహాయపడుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యలు ఉన్న వారు దీన్ని చక్కగా తినొచ్చు. అందువల్ల పీరియడ్స్ క్రమబద్ధంగా మారతాయి. అంతేకాకుండా ఇది మనలో కాల్షియం శోషణను పెంచుతుంది. అందువల్ల ఎముకలు బోలపేతం అవుతాయి. దృఢంగా మారతాయి. అయితే అతి అనర్థం అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. పరిమితికి మించి దీన్ని తినడం వల్ల తప్పకుండా బరువు పెరగడం, ఇతర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి.