Gold Rates Today : భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చి ఊరించిన వెండి, బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ఒక్క రోజే బంగారం వెయ్యికి పైగా పెరగ్గా, వెండి మూడు వేలకు పైగా పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : బంగారం కొనుక్కోవాలనుకునే వారికి ఇది సరైన కాలం కాదనే చెప్పవచ్చు. పసిడి ప్రియులకు అందనంతగా ఈ లోహం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ఐదు రోజులుగా తగ్గుతూ కాస్త ఊరించిన పసిడి ధరలు నేడు మళ్లీ భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజే రూ.1,215 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.75,600కు చేరుకుంది.
విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.రూ.75,600గా కొనసాగుతోంది. వినియోగదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి ఈ ధరకు అదనంగా తోడవుతాయని గుర్తుంచుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) మళ్లీ రూ.75 వేల మార్కును దాటేసింది. శుక్రవారం ఒక్క రోజే దీని ధర రూ.3,865 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర నేడు రూ.95,505కు చేరుకుంది. విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడల్లోనూ వెండి ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ కూడా అప్‌ట్రెండ్‌లో ఉండటం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి రేట్లు సైతం భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం స్పాట్ గోల్డ్ ధర 42 డాలర్లు పెరిగి 2379కి చేరుకుంది. ఔన్సు వెండి 31.30 డాలర్లుగా ఉంది.