కొణిదెల కుటుంబం అంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న వేడుకలన్నీ ఒక్కోటిగా నెరవేరుతున్నాయి. వీటికి కారణం వారి శ్రమ, కఠోర దీక్ష అయినప్పటికీ మెగా మనవరాలు క్లీంకార జన్మించిన తరువాతే జరుగుతుండడంతో.. ఈ సంబరాలకు కారణం క్లీంకార పాప జాతకమే అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
Mega Celebration: కొణిదెల కుటుంబం అంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న వేడుకలన్నీ ఒక్కోటిగా నెరవేరుతున్నాయి. వీటికి కారణం వారి శ్రమ, కఠోర దీక్ష అయినప్పటికీ మెగా మనవరాలు క్లీంకార జన్మించిన తరువాతే జరుగుతుండడంతో.. ఈ సంబరాలకు కారణం క్లీంకార పాప జాతకమే అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పెద్దలను ఒప్పించి ఉపాసనను పెళ్లీ చేసుకున్నాడు. చాలా కాలంగా సంతానం కలుగలేదు. దీంతో మెగా ఇంట్లో ఆ వేడుక ఎప్పుడెప్పుడా అని అభిమానులతో పాటు చిరంజీవి సైతం ఎదురు చూసినట్లు చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు.
ఎట్టకేలకు రామ్ చరణ్, ఉపానలకు పెళ్లై పదకొండేళ్లకి క్లింకార జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాను పుట్టిన నక్షత్రం, గడియా అన్నింటిని పరిగణలోకి తీసుకొని వేదపండితులు శోధించి ఆ పాపకి క్లింకార అని నామకరణం చేశారు. తన జాతకం గురించి సైతం మీడియాలో ఎంత పెద్ద రచ్చ అయిందో ఆ మధ్య చూశాము కూడా. తన జాతకం మహాలక్ష్మీ జాతకం అని తాను ఉన్న చోట సిరిసంపదలు, విజయకేతనాలు ఉంటాయి అని పలువురు వేదాఆచార్యులు చెప్పారు. తాజా పరిణామాలు చూస్తుంటే అవన్ని నిజమే అనిపిస్తుంది.
అయితే మెగావారసురాలు పుట్టినప్పటి నుంచి తన ముఖాన్ని మీడియాకు చూపించకుండా పేరెంట్స్ జాగ్రత్త పడుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఏదైనా పాప మాత్రం మెగాకుటుంబానికి బాగా కలిసొచ్చింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న మెగా ఇంట్లో తన జన్మతో సంబరాలు తెచ్చింది. ఆ వెంటనే సినిమా పరిశ్రమలో అత్యున్నత అవార్డు శిఖరం అయిన అస్కార్ వచ్చింది. దీంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆస్కార్ జ్యూరీలో మెంబర్ గా కూడా అయ్యాడు. మెగా వారసురాలు వచ్చిన వేళావిశేషం రామ్ చరణ్ అంతర్జాతీయంగా కీర్తి పొందారు అని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఫ్యామిలీకి చెందిన మరో హీరో అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డ్ దక్కింది. తెలుగు ఇండస్ట్రీకి ఎప్పడు దక్కని గౌరవం ఇది. పుష్ప సినిమాక బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది.
ఇక మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపికయ్యారు. అప్పటి వరకు పద్మభూణ్గా ఉన్న చిరంజీవి పద్మవిభూషణుడిగా మారారు. ఇదంత క్లింకార జాతకచక్రమే అని పండితులు భావిస్తున్నారు. అలాగే ఎన్నాళ్ల నుంచో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సుస్థిర స్థానం కోసం పరితపిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన పార్టీ 21 సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించారు. దాంతో తొలిసారి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న వేడుకలు అన్ని వరుస జరగడం వెనుక క్లీంకార జాతకం ఉందని కొందరి అంచనా. ఈ నమ్మకాలతో పాటు ప్రతీ విజయం వెనుక వారు చేసిన శ్రమ, పట్టుదల ఉంటుంది అనేది ఎవరు కాదనలేని నిజం.