‘బింబిసార’ తర్వాత మరో సరికొత్త సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అసలు టైటిలే అమిగోస్ అని ఇంగ్లీష్‌లో పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఈ టైటిల్ వివరణ కూడా ఇచ్చాడు. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని చెప్పాడు. టైటిల్ క్లాస్ ఏమో గానీ.. సినిమా మాత్రం ఊరమాస్ అని అంటున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే.. కళ్యాణ్ మరో హిట్ అందుకున్నట్టే కనిపిస్తోంది. ట్రిపుల్ యాక్షన్‌లో కళ్యాణ్ రామ్ చించేశాడు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమాలో త్రిపుల్ రోల్ చేశాడు.. ఇక ఇప్పుడు నేను త్రిపాత్రాభినయం చేస్తున్నాని.. ట్రైలర్ లాంచ్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అలాగే ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది.. తమ్ముడు తారక్ కూడా వస్తున్నాడని చెప్పాడు. ఎల్లుండి అంటే సండే, ఫిబ్రవరి 5న అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక కళ్యాణ్ రామ్ ఈ న్యూస్ చెప్పడమే ఆలస్యం.. ఎన్టీఆర్ 30 ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈసారి తారక్ ఎన్టీఆర్ 30 అప్టేట్ ఇవ్వడం పక్కా అని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అంతేకాదు అన్న వస్తున్నాడట.. ఈసారి అప్డేట్ ఇచ్చే వరకు వదిలేదే అని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో అమిగోస్ కంటే ఎన్టీఆర్ 30 రచ్చే ఎక్కువగా జరిగేలా ఉంది. మరి తారక్ ఫ్యాన్స్ కోసమైనా ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో చూడాలి. ఇకపోతే.. కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుంచి 2023లో వస్తోన్న మూడో చిత్రం ఇది. దాంతో మైత్రీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు.