»Singapore Airlines Singapore Airlines Ceo Public Apology
Singapore Airlines: సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈవో బహిరంగ క్షమాపణ!
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ గాల్లో భారీ కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ సీఈవో గో చూన్ ఫాంగ్ ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణ తెలిపారు.
Singapore Airlines: Singapore Airlines CEO public apology!
Singapore Airlines: లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ గాల్లో భారీ కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడు మరణించాడు. అలాగే మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ప్రయాణికులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ సీఈవో గో చూన్ ఫాంగ్ స్పందించారు. బహిరంగంగా ప్రయాణికులకు క్షమాపణ తెలిపారు. భయానక అనుభవానికి చాలా చింతిస్తున్నామని తెలిపారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎస్క్యూ 321 విమానంలో ఉన్న అందరూ అనుభవించిన బాధాకరమైన అనుభవానికి చింతిస్తున్నామని కూడా తెలిపారు. విమనంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ కట్టుబడి ఉందన్నారు. ప్రమాదానికి సంబంధించి దర్యాప్తులో అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో క్షేమంగా బయటపడిన 143 మంది ప్రయాణికులు, సిబ్బందిని మరో విమానంలో వారి గమ్య స్థానాలకు తరలించామన్నారు. మిగిలిన 79 ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది బ్యాంకాక్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రయాణికులతో పాటు సిబ్బందిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.