»Kishan Reddy Congress Came To Power Because Of Opposition To Kcr
Kishan Reddy: కేసీఆర్ మీద వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు.
Kishan Reddy: Congress came to power because of opposition to KCR
Kishan Reddy: కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. దేశంలో మేధావులు, విద్యావంతులు కూడా బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. ఇకపై తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల జరిగిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఫలితాలు ఉంటాయన్నారు.
అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ప్రజలను మళ్లీ ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు బీజేపీకి కైవసం చేసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని కిషన్ రెడ్డి తెలిపారు.