టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె వడోదరలోని పాండ్యా నివాసానికి వెళ్లి హార్దిక్ కుటుంబాన్ని కలిసింది. తన కుమారుడు అగస్త్యతో కలిసి హార్దిక్ తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులతో ఆమె సరదాగా గడిపింది. నటాషా తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.