ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా అంటారా? మీరు చూడకున్నా ఇడ్లీ కుల్ఫీ మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్ ను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇడ్లీ కుల్ఫీ గురించే చర్చ. ఇదివరకు చాలా కొత్త కొత్త ఐటెమ్స్‌ను తయారు చేసి సోషల్ మీడియాలో వాటి వీడియోలు పెట్టారు గుర్తుందా? బిస్కెట్ పకోడీ, యాపిల్ పకోడి, మ్యాగీ ఐస్ క్రీమ్, చాకొలేట్ బజ్జీలు.. ఇలా రకరకాలుగా వెరైటీ వంటకాలు చేసి నెటిజన్లకు రుచి చూపిస్తుంటారు కొందరు ఫుడ్ ఔత్సాహికులు.
తాజాగా ఇడ్లీ కుల్ఫీని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే కుల్ఫీని చట్నీలో ముంచుకొని తినడం కాదు. కుల్ఫీ ఆకారంలో ఇడ్లీలు తయారు చేస్తారన్నమాట. కుల్పీని ఎలా నోట్లో పెట్టుకొని తింటామో.. పుల్ల పట్టుకొని చట్నీ అద్దుకొని ఈ ఇడ్లీలను కూడా అలాగే తినాలన్నమాట. ఈ వెరైటీ వంటకాన్ని చూసి నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. ఇడ్లీతో ఆటలేంటి.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. మావల్ల కాదు.. ఇలాంటి వంటకాల టేస్ట్ మేం చేయలేం అంటూ మరికొందరు కామెంట్లు చేస్తూ ఆ వంటకాన్ని మాత్రం బాగానే వైరల్ చేస్తున్నారు. అయితే.. ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ.. విజిట్ ఉడుపి అనే ట్విట్టర్ అకౌంట్లో మాత్రం ఈ వంటకానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.