టైటిల్ చూసి షాక్ అయ్యారా? అసలు 30 రూపాయలకు చాయ్ కూడా రాదు. అలాంటిది చికెన్ బిర్యానీ ఎలా ఇస్తారు.. అనే డౌట్ వచ్చిందా? మీకు వచ్చిన డౌట్ నిజమే కానీ.. రూ.30 కే చికెన్ బిర్యానీ కూడా నిజమే. అవును.. రూ.32 కే మటన్ బిర్యానీ కూడా నిజమే. కానీ.. అది 2023 లో కాదు.. 2001 లో.
ఎస్.. 2001 లో ఓ రెస్టారెంట్‌కు చెందిన మెనూ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2001 కు చెందిన మెనూ కార్డ్‌ను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అబ్బ.. ఎంత తక్కువగా ఉన్నాయి ధరలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2001 లో ఇంకా సెల్ ఫోన్స్ కూడా రాలేదు. నోకియాకు చెందిన ఫీచర్ ఫోన్ల కాలం అది. అది కూడా ఎవరో ఒకరి దగ్గర ఉండేది. లేదంటే రిలయెన్స్ ఫోన్లు అందుబాటులో ఉండేవి.
అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా తేడాలు వచ్చేశాయి. ఒక జనరేషనే మారినంత తేడా. మరి.. ఇక రేట్స్ పెరగవా? అప్పుడు చికెన్ బిర్యానీ రూ.30 అయితే.. ఇప్పుడు రూ.300 ఉంది. అంటే 20 ఏళ్లలోనే రేట్లు 10 రెట్లు పెరిగాయన్నమాట. ఆ రెస్టారెంట్ మెనూ కార్డులో మటన్ బిర్యానీతో పాటు ఫిష్ ఫ్రై రూ.10, పరాటా రూ.5, మటన్ హండీ రూ.50, మటన్ కబాబ్ రూ.25 గా ఉంది. అసలు ఇది ఏ రెస్టారెంట్‌కు చెందిన మెనూ కార్డు, ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అనే విషయాలు మాత్రం తెలియలేదు.