Mrunal Thakur: హాట్ న్యూస్.. అతనితో మృణాల్ డేటింగ్?
సీతారామం సినిమా క్లాసికల్ హిట్ అవడంతో.. తెలుగుతో పాటు హిందీలోను వరుస ఆఫర్స్ అందుకుంటోంది మృణాల్ ఠాకూర్. అయితే.. ఈ బ్యూటీ ఫలానా వాడితో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా మరోసారి అలాంటి న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
Mrunal Thakur: సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించిన మృణాల్ ఠాకూర్ చేతిలో.. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పూజా మెరీ జాన్, పిప్పా, ఆంఖ్ మిఖోలి వంటి సినిమాల్లో నటిస్తోంది సీత. అయితే ఈ ముద్దుగుమ్మ డేటింగ్ విషయంలో అప్పుడప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. ఆ మధ్య పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది. ‘వివాహ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని.. తన స్నేహితుల్లో చాలా మంది పెళ్లి చేసుకొని సంతోషంగా సంసార జీవితాన్ని గడుపుతున్నారని’ చెప్పుకొచ్చింది.
కాకపోతే మన ఆలోచనలు, అభిరుచులకు దగ్గరైన వ్యక్తి కోసం ఎదురు చూడాలి.. పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.. ఓపిక పడితే సరైన జీవిత భాగస్వామి దొరుకుతాడు. పెళ్లి గురించి ఏదో ఒక దశలో తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిందేనని.. చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ముంబైలోని ఓ రెస్టారెంట్ లో నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరూ హగ్ చేసుకోవడం, చేతులు పట్టుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మృణాల్ అతనితో డేటింగ్ చేస్తుందనే టాక్ ఊపందుకుంది.
కానీ సిద్ధాంత్, అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో రిలేషన్లో ఉన్నాడనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు మృణాల్తో క్లోజ్‌గా కనిపించడంతో.. సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని బీ టౌన్ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. కానీ.. ఈ ఇద్దరూ కలిసి సినిమా పని కోసమే కలిసినట్టుగా కొందరు అంటున్నారు. కాబట్టి.. ప్రేమ, డేటింగ్ వార్తల్లో నిజముందని చెప్పలేం.