WGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 90% సబ్సిడీతో పసుపు ఉడకబెట్టే యంత్రాలను అందిస్తున్నదని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. చెన్నారావుపేట మండలంలో అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో రైతులకు యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.