ప్రకాశం: మార్కాపురం కలెక్టర్ కార్యాలయం ఆవరణ వద్ద బిల్డింగ్ నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో కార్మికులు భవన కార్మిక సంక్షేమ బోర్డులో గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు జిల్లా కార్యదర్శి షేక్ అన్వర్ భాష అందజేశారు.