AP TS Election Campaign : దేశ వ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. తెలంగాణలో ఒక్క లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరగనుండగా, ఆంధ్రప్రదేశ్లో లోక్ సభ, శాసన సభలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. 48 గంటల ముందు ప్రచారం ఆగిపోవాలి కాబట్టి శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి రెండు రాష్ట్రాల్లోనూ తెర పడనుంది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా పది రాష్ట్రాల్లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 96 నియోజకవర్గాల్లో మే 13న ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లైతే మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఇందు కోసం మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింంది. తద్వారా ఒక్కో కేంద్రంలోనే దాదాపుగా పదిహేను వందల మంది ఓటు హక్కును వినియోగించుకునేట్లు ఏర్పాటు చేశామని పేర్కొంది.
ఇక తెలంగాణ(telangana) రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ స్థానాలకు మే 13న ఓటింగ్ జరగనుంది. ఈ విసయమై ఈసీ సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం నిలిచిపోనుందని తెలిపారు.