»Horoscope Today Todays Horoscope 2024 April 11th Astrology
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 April 11th).. శుభవార్త వింటారు.
ఈ రోజు(2024 April 11th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
ఈ రాశివారు శాశ్వత పనులు మొదలుపెడుతారు. అనుకోకుండా ధనలాభం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి అవడంతో ఆనందిస్తారు. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. మొదలు పెట్టిన పనుల్లో దిగ్విజయాన్ని పొందుతారు.
వృషభం
ఈ రాశివారు మొదలుపెట్టిన పనులన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. సన్నిహితుల నుంచి మర్యాద మన్ననలను పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. తోటి ఉద్యోగులు నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీ ఆలోచనలు విజయాన్ని చేకురుస్తాయి. అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
మిథునం
అత్యంత సన్నిహితులను కలువబోతారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్త్రీల మూలకంగా లాభాలు పొందే అవకాశం ఉంది. షూరు చేసిన పనుల్లో విజయం పొందుతారు. అనుకొని శుభవార్తలు వింటారు. ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది.
కర్కాటకం
ఈ రాశివారు అన్నింటా విజయాన్నే సాధిస్తారు. అనుకోని ధనలాభం ఉంది. మీమీరంగాల్లోని అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. బంధు, మిత్రులను కలిసే అవకాశం ఉంది. మంచి శుభవార్తలు వింటారు.
సింహం
ఈ రాశివారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు అవి నేరవేరుతాయి. ఆకస్మిక ధనలాభం తద్వారా ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. దైవదర్శనం, భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.
కన్య
కుటుంబ పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. అందువలన అప్పులు తీరుతాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు సంపాదిస్తారు. మీరు చేసే పనులను ఆదర్శంగా తీసుకోవడానికి ఇతరులు కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది.
తుల
సన్నిహితుల సహకారం లభిస్తుంది. అనుకోని ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బాధలు వేదిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనుకొని ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
వృశ్చికం
మనోధైర్యంతో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమమే మీకు విజయాన్ని చేకురుస్తుంది. గత వైరాలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడుతారు. ముఖ్యులను కలుస్తారు. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి.
ధనుస్సు
అప్పులు తీరిపోతాయి, కొత్త అప్పులు చేస్తారు. విదేశయాన ప్రయత్నాలకు మొదలు పెడుతారు. అవి నేరవేరే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. అది తగ్గించేకోవాలి. ప్రతీ పనిలో శ్రద్ధ అవసరం. మొదలు పెట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.
మకరం
ఈ రాశివారు కుటుంబ బాధలు దూరమవుతాయి. మొదలుపెట్టిన పనుకు కష్టాలు ఎదురవుతాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మంచి పనులే చేయండి. తోటివారితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి.
కుంభం
అనుకోని శుభార్త వింటారు. కుటుంబ పరిస్థితి చాలా సంతృప్తికరంగా మారుతాయి. చుట్టుపక్కల ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. స్త్రీలు మిక్కిలి ఆనందంగా గడుపుతారు.
మీనం
ఈ రాశివారు మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులను గౌరవిస్తారు. గొప్పపరిచయాలు ఏర్పడుతాయి. కుటుంబసౌఖ్యం పొందుతారు. స్త్రీల వల్ల లాభాలు ఉన్నాయి. మంచి పనులు త్వరగా నెరవేరుతాయి.