WGL: నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోళు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. కనీస మద్దతు ధర రూ. 2400 చెల్లిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా ముందుగానే కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.