అందరి హీరోల్లా కాకుండా కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న సినిమాలు చేస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ. క్లాస్, మాస్, కమర్షియల్, ప్రయెగాత్మక.. ఇలా అన్ని జానర్ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఎఫ్ 3 మూవీతో బాగానే ఎంటర్టైన్ చేశాడు వరుణ్. అయితే ‘గని’ మూవీతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులెస్తున్నాడనే చెప్పాలి. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు వరుణ్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి వరుణ్-ప్రవీణ్ సినిమా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వరుణ్. VT13 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ వివరాలను సస్పెన్స్‌లో పెడుతూ.. ఒక చిన్న వీడియోను విడుదల చేశాడు. ఇందులో వరుణ్ ఎంతో ఎగ్జైటింగ్‌గా స్క్రిప్ట్‌ను చదువుతున్నట్లు చూపించారు. చివరగా స్క్రిప్ట్ లో జై హింద్ అని చూపించారు. అలాగే దానిపై ఒక ఎయిర్ క్రాఫ్ట్ బొమ్మని కూడా ఉంచారు. దాంతో ఈ సినిమా వార్ బ్యాక్ డ్రాప్లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక VT13 పూర్తి డీటెయిల్స్‌ని సెప్టెంబర్ 19న వెల్లడించనున్నట్టు తెలిపాడు. దాంతో ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు.. ఎలాంటి సబ్జెక్ట్‌తో రాబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇలాంటి విషయాలు తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.