»Mahesh Babu Mahesh Babu Canceled Everything For Rajamouli
Mahesh babu: రాజమౌళి కోసం మహేష్ బాబు అన్నీ క్యాన్సిల్?
దర్శక ధీరుడు రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అయితే.. ఈ సినిమా కోసం మహేష్ బాబు అన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
Mahesh babu: Mahesh babu canceled everything for Rajamouli?
Mahesh babu: మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు రాజమౌళి. అన్లిమిటెడ్ బడ్జెట్‌తో శ్రీ దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టేశాడు మహేష్ బాబు. ఈ మధ్య బయట ఎక్కడ చూసిన లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు మహేష్. దీంతో.. ఇదే లుక్‌లో ఎస్ఎస్ఎంబీ 29లో కనిపించే ఛాన్స్ ఉంది.
ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో.. ఈలోపు కమర్షియల్ యాడ్స్ కంప్లీట్ చేయడంతో పాటు.. ఫ్యామిలీతో కలిసి వీలైనన్ని ఫారిన్ ట్రిప్స్ వేసేస్తున్నాడు మహేష్. మామూలుగానే చాలా తక్కువ గ్యాప్‌లో వెకేషన్‌కు వెళ్తుంటాడు మహేష్. సినిమా షూటింగ్ ఉన్న సరే.. మధ్యలో బ్రేక్ వస్తే ఫారిన్‌కు చెక్కేస్తుంటాడు. కానీ ఒక్కసారి రాజమౌళితో కమిట్ అయితే.. ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండక తప్పదు.
రీసెంట్గా సమ్మర్ వెకేషన్‌కు ప్లాన్ చేశాడట మహేష్. కానీ అనుకోకుండా సడన్‌గా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందట. రాజమౌళి వర్క్ షాప్ స్టార్ట్ చేయాల్సి ఉందని చెప్పడంతో.. మహేష్ ప్లాన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడట. సినిమా కోసం ఏదైనా చేసే హీరోల్లో మహేష్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు, కాబట్టి రాజమౌళి కోసం ఎంత రిస్క్ అయిన చేయడానికి వెనుకాడడు. మరి మహేష్, రాజమౌళి కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.