ADB: తొలి రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాల గల పిల్లల క్రీడా పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వివిధ విభాగాల్లో సమిష్టి ప్రతిభతో మొత్తం 35 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. కలెక్టర్ రాజర్షిషా విజేత విద్యార్థులను, వారికి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.