HNK: నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.