»Watch Minister Smriti Iranis Scooter Ride In Amethi
Smriti Irani : ఎన్నికల ప్రచారంలో బండి నడిపిన స్మృతీ ఇరానీ
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్కూటర్ నడిపారు. కార్యకర్తలు, నేతలతో కలిసి స్కూటర్ రైడ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Smriti Iranis Scooter Ride : కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతీ ఇరానీ అమేథీ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె నామినేషన్‌ను దాఖలు చేశారు. రాత్రి జరిగిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె స్కూటర్ని రైడ్ చేశారు. చక్కగా చీర కట్టుకుని, హెల్మెట్ పెట్టుకుని నేతలు, కార్యకర్తలతో కలిసి స్కూటర్‌పై ర్యాలీ చేశారు.
ఇలా స్కూటర్(Scooter) నడపడంతో పలువురు అభిమానులు స్మృతీ ఇరానీ (Smriti Irani) వద్దకు చేరుకుని సెల్ఫీలు దిగారు. ఇలా ఆమె ఫోటోలకు ఫోజులిస్తూ ముందుకు కదిలారు. వరుసగా రెండోసారి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కడి ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోఅమేథీ(Amethi) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ, బీజేపీ తరఫున స్మృతీ ఇరానీలు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేతగా ఉన్న రాహుల్‌ని స్మృతీ ఇరానీ ఓడించారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా బీజేపీ ఆమెకే సీటును కేటాయించింది. ఈ ఎన్నికల్లో అమేథీ స్థానానికి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ మే 20న పోలింగ్ జరగనుంది.