IPL Betting: ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్.. ఒకరు అరెస్ట్
ఐపీఎల్ మ్యాచ్‌పై ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు పక్కా సమాచారంతో రంగంలో దిగిన పోలీసులకు ఓ వ్యక్తి దొరికాడు. అతని దగ్గర నగదు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
IPL Betting: ఐపీఎల్ మ్యాచ్‌పై(IPL match) ఆన్లైన్లో బెట్టింగ్‌లకు(Online betting) పాల్పడుతున్నట్లు పక్కా సమాచారంతో రంగంలో దిగిన పోలీసులకు ఓ వ్యక్తి చిక్కాడు. ఫిలింనగర్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని ఓ డీజే బార్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు ఆ బార్ వద్దకు వెళ్లారు. శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో పోలీసులు అక్కడకు వెళ్లగా వారిని చూసి సదరు వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దార్యాప్తు చేపట్టారు. విచారణలో అతని పేరు చెరకూరి రమేష్ అని అతని వయస్సు 27 సంవత్సరాల వరకు ఉంటుందని, అతడు మస్తాన్ నగర్లో నివాసం ఉంటున్నట్లు తేలింది. అతను వృత్తిరిత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఐపీఎల్ సీజన్ మొదలైన అప్పటి నుంచి అతను ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు దాని కోసం లోటస్247.బెట్ అనే సైట్‌ను రన్ చేస్తున్నట్లు తేలింది. అతడి వద్ద రూ.16వేల నగదు, రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్టింగ్ కింద రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.