»Social Media Star Ghafran Safadi Brutally Murdered In Iraq
Viral News: ఇరాక్‌లో సోషల్ మీడియా స్టార్ దారుణ హత్య
ఇరాక్‌లో సోషల్ మీడియా స్టార్‌ను దారుణంగా హత్య చేశారు. బైక్ మీద వచ్చిన కొందరు ఆమెపై కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Social media star Ghafran Safadi brutally murdered in Iraq
Viral News: ముస్లీం పరిపాలన దేశాల్లో సోషల్ మీడియా స్టార్లపై దారుణాలు సర్వసాధారణంగా జరుగుతాయి. తాజాగా ఇరాక్ దేశంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా స్టార్ ఘఫ్రాన్ సఫాదీ అనే లేడీని హత్య చేశారు. బాగ్దాద్‌లోని ఆమె ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. తన ఇంటి అవరణలో ఉన్నప్పుడు బైక్‌పై కొందరు దుండగులు వచ్చి సఫాదీపై కాల్పులు జరిపారు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఉమ్ ఫహాద్ టిక్‌టాక్‌లో మంచి ప్రజాదరణ ఉంది. అందులో ఆమెకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. తూర్పు బాగ్దాద్‌లోని జయౌనా ప్రాంతంలో ఆమె నివస్తుంది. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీలో దృష్యాలు రికార్డు అయ్యాయి. ఆమె ఇంటి పరిసరాల్లో తిరుగుతుంది. అదే సమయంలో బైక్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గన్ తీసి ఆమెపై కాల్పులు జరిపారు. సఫాదీ కిందపడగానే వారు అక్కడనుంచి పరారీ అయ్యారు. అయితే నిందుతులు ఎవరన్నది స్పష్టంగా కనిపించలేదని పోలీసులు తెలిపారు. గతంలో సఫాదీ చేసిన వీడియోలు వివాదస్పదమయ్యి ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష కూడా పడింది. శిక్ష తరువాత ఆమె బయటకు వచ్చి పాప్ మ్యూజిక్ డ్యాన్సులు చేస్తుంది. 2023లో కూడా మరో సోషల్ మీడియా స్టార్ నూర్ అల్సఫర్ అనే యువతిని కూడా కాల్చి చంపారు. కూడా 2023లో హత్యకు గురయ్యారు.