HNK: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేస్తూ అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 58వ డివిజన్ NTO కాలనీలో ఆదివారం అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాదయాత్రలో గుర్తించిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెడుతున్నామని చెప్పారు.