రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా అనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే.. ఈ ఇద్దరి కలయిక ఎవరి కోసం అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఇప్పట్లో ప్రశాంత్ నీల్‌తో విజయ్ సినిమా కష్టం కాబట్టి..!
Vijay Devarakonda: For Vijay Devarakonda, Prashanth Neel.. Prabhas? For NTR?
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు ఒక సాలిడ్ హిట్ కావాలి. పాన్ ఇండియా రేంజ్ హిట్ పడితే.. చూడాలని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు గీతా గోవిందం తర్వాత విజయ్‌కు సరైన హిట్ పడలేదు. భారీ ఆశలు పెట్టుకొని చేసిన లైగర్ సినిమా విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి సోసోగానే నిలిచింది. ఇక రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మెప్పించలేకపోయింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. ఇలాంటి సమయంలో విజయ్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ బయటికి రావడంతో.. రౌడీ ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు.
లేటెస్ట్గా హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లాడని.. ఈ క్రమంలో మూవీ చేస్తున్నారని పుకార్లు మొదలయ్యాయి. ఇక ప్రశాంత్ నీల్‌తో సినిమా అంటే, విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ పడినట్టేనని అనుకున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలిసింది. విజయ్ ఇంటికి డిన్నర్ చేయడానికే ప్రశాంత్ వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు.. విజయ్‌తో పూర్తిస్థాయి సినిమా కాకుండా.. సలార్ 2 లేదా ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా సలార్ సినిమాలో విజయ్ పేరు వినిపించింది.
ఇప్పుడు విజయ్, ప్రశాంత్ నీల్ మీటింగ్ అందుకు సంబంధించినదే అయి ఉండే అవకాశం లేకపోలేదు. దీంతో.. సలార్ కోసమా? లేదా ఎన్టీఆర్ 31 కోసం రౌడీని సంప్రదించాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎదుకంటే.. ప్రశాంత్ నీల్‌తో సినిమా సెట్ అవాలంటే.. విజయ్ ఇంకొన్నేళ్లు వెయిట్ చేయాలి. ప్రశాంత్ నీల్ కమిట్ అయిన సలార్ 2, ఎన్టీఆర్ 31, కెజియఫ్ చాప్టర్ 3 అయ్యాకే రౌడీతో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఈ క్రేజీ మీటింగ్ మాత్రం క్యాజువల్‌గానే జరిగిందని.. ప్రశాంత్ నీల్, విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.