ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా పై రామ్ అభిమానులతో పాటు పూరి అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ రామ్ వల్లే ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Double ISmart: డబుల్ ఇస్మార్ట్ సినిమా.. ఇటు హీరో రామ్, అటు దర్శకుడు పూరి జగన్నాథ్‌కు చాలా కీలకం. కానీ ఈ సినిమా షూటింగ్ రామ్ వల్ల ఆగిపోయిందనే టాక్ నడుస్తోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరికి ఇస్మార్ట్ శంకర్ సినిమా సాలిడ్ హిట్ ఇచ్చింది. రామ్‌కు సూపర్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అయితే.. ఈ సినిమా తర్వాత రామ్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. లైగర్‌తో పాన్ ఇండియా దెబ్బ తగిలించుకున్నాడు పూరి. దీంతో.. ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని మరోసారి కలిశారు పూరి, రామ్. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ సినిమా అనౌన్స్ చేసి.. రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. కానీ అనుకున్న సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేకపోయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయింది.
అంతేకాదు.. ఏకంగా ఈ సినిమా ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి రామ్ కారణం అనే ప్రచారం తెరపైకి వచ్చింది. రెమ్యునరేషన్ పూర్తిగా ఇస్తేనే షూటింగ్ చేస్తానని చెప్పాడట రామ్. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఫైనాన్షియల్ కారణంగా కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వాయిదా వేశారట. అంతేకాదు.. ఈ మూవీని రెమ్యునరేషన్ లేకుండా చేస్తున్నాడట రామ్. సినిమాకు వచ్చిన లాభాల్లో షేర్ తీసుకోవడానికి ఓకె చెప్పాడట. దీంతో మళ్ళీ రామ్, పూరి ఈ మూవీ షూటింగ్ పై ఫోకస్ చేశారని సమాచారం. ఏదేమైనా.. ఇప్పటికైనా డబుల్ ఇస్మార్ట్ కంప్లీట్ అవుతుందేమో చూడాలి.