JN: మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం మీద శనివారం జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. MLA క్యాంపు కార్యాలయం అంటే అది ప్రభుత్వ ఆస్తి అని, దానిని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని అన్నారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.