NLG: గుర్రంపోడు మండలంలోని చామలేడులో భూవివాదం నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో గ్రామ ఉపసర్పంచ్ గుండెబోయిన చిన్న పెద్దులుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు తన వ్యవసాయ భూమికి వెళ్లి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అడ్డుకుని దాడికి పాల్పడ్డాడని చిన్న పెద్దులు తెలిపారు.