VKB: గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా వ్యాపారులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడకూడదని పోలీసులు సూచించారు. కుల్కచర్లలో పోలీసులు అన్ని హోటళ్లలో సోదాలు నిర్వహించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని వ్యాపారులకు తెలిపారు. పోలీసుల ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.