Is Ghee Bad : చాలా మందికి భోజనంలో నెయ్య వేసుకుని తినడం అంటే ఇష్టం ఉంటుంది. అయితే అది తినడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నట్లుగా దాన్ని దూరం పెడుతుంటారు. అయితే ఈ విషయంలో అసలు నిజం ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.
నెయ్యిని(Ghee) మరీ ఎక్కువగా కాకుండా మితంగా తినడం వల్ల అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వల్ల కొలస్ట్రాల్(Cholesterol) పెరిగిపోదు. అయితే మరీ ఎక్కువగా వేసుకోకూడదని గుర్తుంచుకోవాలి. నేతిని వాడేప్పుడు బజారులో దొరికే ఏదో ఒకదాన్ని తెచ్చుకుని తినకూడదు. అది ఏ విధంగా కల్తీకి గురై వస్తుందో మనకు తెలియదు. కాబట్టి అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా ఊహించలేం.
నెయ్యని తినాలని అనుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. దీన్ని కాచేప్పుడు ఎక్కువ మంట పెట్టి అధిక ఉష్ణోగ్రతల వద్ద దీన్ని కాయకూడదు. అలా చేయడం వల్ల అందులో ఆరోగ్యానికి హాని కలిగించే సమ్మేళనాలు ఏర్పాడతాయి. అలా కాకుండా తక్కువ మంట మీద నిదానంగా దీన్ని కాచి చల్లార్చి భద్రపరుచుకోవాలి. ఇలా చేసిన దాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. చర్మం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. జుట్టు, గోళ్లు మెరుపును సంతరించుకుంటాయి. కీళ్లలో గుజ్జు తగ్గిపోకుండా ఉంటుంది. అందుకనే ఈ మధ్య చాలా మంది డైటీషియన్లు ఉదయాన్నే పరగడుపు ఓ స్పూను నెయ్యని(Ghee) తీసుకోమని సూచిస్తున్నారు. అలాగే భోజనంలోనూ దీన్ని మితంగా తీసుకుంటూ ఉండటం వల్ల జీర్ణ క్రియ సజావుగా జరుగుతుంది.