ప్రతి ఒక్కరిలో ఒక ఇంజనీర్ ఉంటాడు. ఇంజనీర్ అంటే చదువుతేనే కాడు. కాస్త కామన్ సెన్స్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరిలో నుంచి ఇంజనీర్ పుట్టుకొస్తాడు. దాన్ని నిరూపించడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 దోశ ప్లేట్స్ ను ఒంటి చేత్తో బ్యాలెన్స్ చేస్తున్నాడు ఈ వెయిటర్. హోటల్ కు వచ్చిన కస్టమర్లకు ఒక్కొక్కరికి ఒక్కోసారి వెళ్లి దోశ సర్వ్ చేయడం ఒక స్పెషాలిటీ అయితే.. ఒకేసారి అందరు కస్టమర్లకు దోశలను సర్వ్ చేయడం మరో స్పెషాలిటీ. ఇక్కడ హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి.
అతడి ఇంజనీరింగ్ తెలివిని చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహాంద్రా కూడా ఆశ్చర్యపోయారు. అందుకే ఆయన ఒలింపిక్స్ లో మెడల్ ఇవ్వాలని ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా ఏదైనా పోస్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా? సోషల్ మీడియా దద్దరిల్లాల్సిందే కదా. ఈ వీడియోను కూడా నెటిజన్లు అదే స్పీడ్ తో వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసుకోండి మరి.
We need to get ‘Waiter Productivity’ recognised as an Olympic sport. This gentleman would be a contender for Gold in that event… pic.twitter.com/2vVw7HCe8A