»Salman Khan Suspects Who Opened Fire At Salman Khans House Arrested
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితులు అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసంలో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసంలో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల తర్వాత వాళ్లు ముంబాయి నుంచి గుజరాత్‌కి పరారయ్యారు. గుజరాత్‌లోని భుజ్‌లో దొరికినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీళ్లను ముంబాయికి తీసుకొచ్చి విచారిస్తామని తెలిపారు. ఈ నిందితులు నవీ ముంబాయి పన్వెల్‌లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసిన విషయం తెలిసిందే.
సల్మాన్‌కు పన్వెల్‌లో కూడా ఒక ఫాంహౌస్ ఉంది. అయితే ఈ కేసులో భాగంగా ముగ్గురు వ్యక్తులను విచారించారు. అందులో ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం పూర్వ యజమాని, మోటారు సైకిల్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్‌ను విచారించారు. అయితే ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వెళ్లి సల్మాన్ ఇంటి దగ్గర నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు.