యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా 'వార్ 2' చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో అదిరిపోయే న్యూస్ ఒకటి హల్చల్ చేస్తోంది.
NTR-Hrithik Roshan: తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్2 కోసం ముంబై వెళ్లాడు. టైగర్ ముంబైలో అడుగు పెట్టగానే అక్కడి మీడియా అతని ఫొటోల కోసం ఎగబడింది. అక్కడ తన కోసం వేచి చూస్తున్న ఫొటోగ్రాఫర్లను చూసి ఆశ్చర్యపోయాడు తారక్. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఆఫీస్ లోకి వెళ్లే ముందు ఎన్టీఆర్ ఫొటోల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు ఫొటోగ్రాఫర్లు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్‌కు ముంబైలో క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక.. టైగర్ నయా లుక్ చూసి.. ఇదే వార్ 2 లుక్ అని తెగ షేర్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న స్పై యూనివర్స్‌గా మూవీగా వార్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య జరిగే యుద్ధం మామూలుగా ఉండదని అంటున్నారు. లేటెస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌పై కీలక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు. అందుకోసం పది రోజుల పాటు ముంబైలోనే ఉండనున్నాడు ఎన్టీఆర్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌తో అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
మామూలుగానే.. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు కూడా అద్భుతమైన డాన్సర్లు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాస్ టాప్ డ్యాన్సర్స్ హీరోల లిస్ట్ తీస్తే ఈ ఇద్దరు టాప్ ప్లేస్‌లో ఉంటారు. దీంతో.. వార్ 2లో నాటు నాటు సాంగ్‌కి మించి ఉండేలా ఒక హై ఓల్టేజ్ సాంగ్ రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఈ ఇద్దరి డ్యాన్స్‌కు థియేటర్లు షేక్ అవడం గ్యారెంటీ.