ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ యూజర్లకు హెచ్చరిక తెలిపింది. కిరాయికి తీసుకున్న స్పైవేర్ ద్వారా లక్షిత సైబర్ దాడులు జరగొచ్చని తాజాగా హెచ్చరించింది. ఐఫోన్‌తో పాటు యాపిల్ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని ఎఫ్ఏక్యూలో తెలిపింది.
Apple: ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ యూజర్లకు హెచ్చరిక తెలిపింది. కిరాయికి తీసుకున్న స్పైవేర్ ద్వారా లక్షిత సైబర్ దాడులు జరగొచ్చని తాజాగా హెచ్చరించింది. ఐఫోన్‌తో పాటు యాపిల్ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని ఎఫ్ఏక్యూలో తెలిపింది. ఈ మేరకు త్వరలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్ పంపే అవకాశం ఉంది. ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసని పెగాసస్ వంటి వాటిని కిరాయి స్పైవేర్‌గా వ్యవహరిస్తుంటారు. అత్యాధునికి సాంకేతికతతో తయారు చేసిన వీటితో కొందరు వ్యక్తులను మాత్రమే లక్ష్యం చేసుకుంటారు.
సమాజంలో సదరు వ్యక్తుల పాత్రం, హోదా, స్థాయి ఆధారంగా టార్గెట్ చేస్తుంటారు. ఇప్పటివరకు వీటిని ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ దాడులుగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కిరాయి స్పైవేర్ ముప్పుగా మార్చారు. ఇప్పటికే మెర్సినరీ స్పైవేర్ ద్వారా చాలామంది ఐఫోన్ సహా ఇతర ఉత్పత్తుల్లోకి సైబర్ నేరగాళ్లు చొరబడినట్లు గుర్తించామని యాపిల్ తెలిపింది. ఎప్పుడు, ఎవరిపై సైబర్ దాడులు చోటు చేసుకుంటాయనేది ముందుగా గుర్తించడం కష్టం. కానీ జరుగుతాయని కచ్చితంగా చెప్పగలమని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని కోసం యూజర్లను అప్రమత్తం చేయడంతో పాటు తగిన జాగ్రత్తలు సూచిస్తూ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.