»Mahatma Phules Spirit Is Involved In Telanganas Progress Kcr
KCR: తెలంగాణ ప్రగతిలో మహాత్మా ఫూలే స్ఫూర్తి ఉంది
తెలంగాణలోని బహుజన కులాలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించడమే మహాత్మా జ్యోతిరావు ఫూలేకి అర్పించే ఘనమైన నివాళి అని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సామాజికవర్గాలు వృద్ధి చెందేలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని అన్నారు.
Mahatma Phule's spirit is involved in Telangana's progress: KCR
KCR: బహుజన బాంధవుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.. తెలంగాణ బహుజన కులాలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించేలా చేయడమే ఫూలేకి మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. నేడు ఆ మహనీయుడి 198వ జయంతి. ఆయన చేసిన త్యాగాలను, దేశానికి ఆయన అందించిన సమ సమాజ కార్యాచరణను కేసీఆర్ స్మరించుకున్నారు. సబ్బండ వర్గాలకోసం జ్యోతిరావు ఫూలే, ఆయన సతీమణి రమాబాయిఫూలే చేసిన పనులను గుర్తు చేసుకున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సామాజిక వర్గాల కోసం చేసిన అనే ప్రగతి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రస్తావించారు.
బీఆర్ఎస్ పాలన అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిందని, అన్ని రంగాల్లో దేశానకిి ఆదర్శంగా నిలిచేలా చేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నేటికి అదే స్ఫూర్తి కార్యాచరణ మున్ముందు అమలు జరగాలని, అలా జరిగితేనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఇదే తెలంగాణను ఒకనాడు వెనకబడిందని, నిర్లక్ష్యం, పేదరికం ఎక్కవ అని హేలన చేశారని కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో సబ్బండ వర్గాలు కలిసి చేసిన పోరాటం ప్రపంచానికే స్పూర్తి అయిందని పేర్కొన్నారు. అందుకే అసాధ్యం అనుకున్న తెలంగాణ సాధించుకున్నామని ఆ స్పూర్తికి కారణం మహాత్మ జ్యోతిరావు ఫూలే ఇచ్చిన స్పూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.