తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు.
KCR announced Lasya's sister Nivedita as Cantonment BRS candidate
KCR: కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖారారు చేశారు. ఈ మేరకు కేసీఆర్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఖారారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాస్య నందిత సోదరి నివేదితను బరిలోకి దింపారు.