KMM: సత్తుపల్లిలో శనివారం 108 ఈఎంటీల సేవలను స్మరిస్తూ వేడుకలు నిర్వహించారు. ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నజీరుద్దీన్ మాట్లాడుతూ.. నిరంతరం శ్రమిస్తూ ప్రాణాలు కాపాడుతున్న ఈఎంటీల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆపదలో ఉన్నవారికి ఈ సేవలు ఎంతో ముఖ్యమని అన్నారు.