»Mahesh Rajamouli Movie Star Hero Aamir Khan Is Almost Fixed
SSMB29: మహేష్-రాజమౌళి సినిమాలో.. ఈ స్టార్ హీరో దాదాపు ఫిక్స్?
ట్రిపుల్ ఆర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ అంచనాలు మామూలుగా లేవు. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఓ స్టార్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
Mahesh-Rajamouli movie.. star hero Aamir Khan is almost fixed?
SSMB29: అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. కాకపోతే.. మహేష్ బాబుతో చేయబోయేది గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ మూవీ అనే క్లారిటీ మాత్రం ఉంది. అలాగే.. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్లో రానున్న ఈ సినిమా.. ఆస్కార్ దగ్గర అవార్డుల పంట పండిస్తుందనే అంచనాలున్నాయి. ఇంతకుమించి మహేష్ బాబు సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏమి లేవు. అందుకే.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే స్క్రిప్టు రెడీ అయిందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ క్యాస్టింగ్ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా చెల్సియా ఇస్లాన్ ఫైనల్ అయినట్టుగా టాక్ ఉంది.
అయితే.. ఈ సినిమాలో ముందు నుంచి ఓ స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉందని వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ పేరు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ కొత్త సినిమాలేవి చేయడం లేదు. దీంతో ఇప్పుడు.. మహేష్, రాజమౌళి సినిమాలో అమీర్ ఖాన్ దాదాపుగా నటిస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో.. రాజమౌళి ఊ.. అనాలే గానీ, నటించడానికి నేను సిద్ధం అని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. ఒకవేళ జక్కన్న అమీర్‌ను అప్రోచ్ అవాలే గానీ.. ఈ క్రేజీ కాంబో సెట్ అయిపోయినట్టే. ఇదే జరిగితే.. ఇండియన్ సినిమా హిస్టరీ దగ్గర ఎప్పుడు చూడని సినిమా చూడబోతున్నామనే చెప్పాలి. మరి జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.