పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల పంపిణీకి మూడు రోజుల సమయం పట్టేదన్నారు. పింఛన్ కోసం వెళ్లి ఎంతోమంది చనిపోయారని విమర్శించారు.
Posani Krishnamurali: పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల పంపిణీకి మూడు రోజుల సమయం పట్టేదన్నారు. పింఛన్ కోసం వెళ్లి ఎంతోమంది చనిపోయారని విమర్శించారు. ప్రస్తుతం పెన్షనర్లకు వాలంటీర్లు దేవుళ్లలా కనిపించారని పోసాని అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు వాలంటీర్లపై కుట్రలు చేశారని మండిపడ్డారు. వాళ్లు చేసే సేవ చూడలేక చంద్రబాబు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఒకసారే పార్టీ పెడతారు. ఆ మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్తారని అన్నారు.
కానీ చంద్రబాబు అలా కాదని పోసాని అన్నారు. అసలు చంద్రబాబు పార్టీ పెట్టలేదని.. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని కబ్జా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీఆర్‌ను.. రాజకీయ భవిష్యత్ కోసం వంగవీటి రాధాను చంపారని మండిపడ్డారు. జగన్‌ను రాజకీయ సమాధి చేయడం కోసం కుట్రలు చేస్తున్నారని.. అందుకే పవన్ కళ్యాణ్‌ను లొంగదీసుకున్నారని పోసాని ఆరోపించారు. కాపులను రౌడీలు, గుండాలు అని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు కాపులను లొంగదీసుకోవడం కోసం పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకున్నారని విమర్శించారు.