»Kishan Reddy We Will Come Back To Power At The Centre
Kishan Reddy: కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తాం
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.
Kishan Reddy: కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కార్యాలయంలో జెండా ఎగురవేసి మాట్లాడారు. రోజురోజుకు రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతోందన్నారు. హామీలను నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని తెలిపారు.
తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణకు రాహుల్ ఆరు గ్యారంటీలు ఇచ్చారు. అవి వంద రోజుల్లో చేసి తీరుతామన్నారు. కానీ వాటిని అమలు చేయకుండా తెలంగాణకు ఎలా వస్తారు? హామీలు అమలు చేయలేదు కానీ.. సభలు పెడుతున్నారని కిషన్రెడ్డి విమర్శించారు.