»Tillu Square Is A 100 Crore Toy First Day Collections 25 Crore
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ 100 కోట్ల బొమ్మ.. ఫస్ట్ డే కలెక్షన్స్ 25 కోట్లా?
ప్రస్తుతం థియేటర్లో టిల్లుగాడి హవా నడుస్తోంది. ఈ వారం రిలీజ్ అయిన డీజె టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావొచ్చనే అంచనాలు మొదలయ్యాయి. ఏకంగా 25 కోట్లుగా మేకర్స్ చెప్పిన మాట.
'Tillu Square' is a 100 crore toy.. First day collections 25 crore?
హిట్ సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఫస్ట్ అదరగొట్టేసినట్టుగా అంచనాలు వేస్తున్నారు. డీజె టిల్లు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో డే వన్ ఎంత రాబడుతుందనే అంచనాలు మొదలయ్యాయి. బుకింగ్స్‌తోనే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పై అంచనాకు వచ్చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే టిల్లు స్క్వేర్ మూవీకి కోటిన్నర వరకు గ్రాస్ బుకింగ్స్ అయినట్లు ట్రేడ్ వర్గాలు మాట. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్లకు పైగా గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ అయినట్టుగా చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్‌తోనే ఆల్మోస్ట్ 500K డాలర్ మార్క్‌ను టచ్ చేసినట్టుగా సమాచారం.
మొత్తంగా.. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ట్రెండ్‌ను బట్టి చూస్తే.. 4 కోట్లకు అటు ఇటు ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. నైట్ షోలకి IPL మ్యాచ్ నుండి పెద్దగా ఇంపాక్ట్ లేకుంటే.. ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా.. టిల్లు గాడు ఫస్ట్ డే కలెక్షన్స్‌తో గట్టిగానే కొట్టేలా ఉన్నాడు. కానీ ఈ సినిమా నిర్మాత నాగవంశీ చెప్పిన లెక్క మాత్రం వేరేలా ఉంది. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్లో మాట్లాడు.. ఫస్ట్ డే 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావచొచ్చని అన్నారు. అలాగే లాంగ్ రన్లో 100 కోట్లు కొల్లగొడుతుందని చెప్పాడు. దీంతో.. టిల్లు ఎంత రాబడుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 27 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని.. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది.