Allu Arjun: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బన్నీ సెల్ఫీ!
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్లో ఉన్నాడు. అక్కడ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సెల్ఫీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Allu Arjun: దుబాయ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్A wax statue మార్చి 28న ఆవిష్కరించారు. ఇదే రోజు 2003లో బన్నీ నటించిన మొదటి చిత్రం గంగోత్రి విడుదలైంది. దీంతో.. ఈ 21 సంవత్సరాల సినీ కెరీర్లో తనకు మద్దుతగా నిలిచిన అభిమానుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు బన్నీ. ఇక మ్యూజియంలో బన్నీ తన విగ్రహం పక్కనే నిలబడి.. తగ్గేదేలే అంటూ సెల్ఫీ దిగాడు. ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజంతో వాక్స్ స్టాట్యూ ఏర్పాటు చేశారు. దీంతో.. సేమ్ టు సేమ్ డ్రస్ వేసుకుని, సేమ్ మ్యానరిజం చూపిస్తూ.. తన వాక్స్ స్టాట్యూ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు అల్లు అర్జున్. సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘ప్రతి నటుడి జీవితంలో ఇదొక మైలురాయి వంటి అనుభవం. నా వాక్స్ స్టాట్యూ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అయామ్ హంబుల్డ్’.. అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అల్లు అర్జున్, పుష్ప.. ది రూల్, తగ్గేదేలే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్. ఇక బన్నీ కూతురు అల్లు అర్హ సందడి మామూలుగా లేదు. తన తండ్రి విగ్రహం పక్కన నిల్చుని తగ్గేదేలే అంటూ స్టిల్ ఇచ్చింది అర్హ. ఆ తర్వాత పుష్ప హుక్ స్టెప్ వేసి అందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం అర్హ క్యూట్ డ్యాన్స్ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి.