»Sam Bankman Fried Crypto King Sam Bankman Jailed For How Many Years
Sam Bankman Fried: క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్‌మన్‌కు జైలు శిక్ష.. ఎన్నేళ్లంటే?
క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్‌కు న్యూయార్క్ కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఎఫ్‌టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది.
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్‌కు న్యూయార్క్ కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఎఫ్‌టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. అమెరికా చరిత్రలోనే ఆర్థిక మోసాలలో ఒకటిగా ఎఫ్‌టీఎక్స్ అని, బ్యాంక్‌మ్యాన్ ఫ్రీడ్ 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడని కోర్టు తెలిపింది. తప్పు అని తెలిసినప్పటికీ, మోసాలకు పాల్పడ్డాడని న్యాయవాది తెలిపారు. కస్టమర్లను మోసం చేశాననే బాధ ఉన్నప్పటికీ విచారణలో మాత్రం దాన్ని ఆయన అంగీకరించలేదన్నారు.
బ్యాంక్మన్ తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. 5-6.5 ఏళ్లకు పరిమితం చేయాలని కోర్టును అభ్యర్థించారు. అతడిది ఇది తొలి నేరమని, ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని తెలిపారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం బ్యాంక్‌మన్‌కు దాదాపు 100 ఏళ్లు శిక్ష పడాలని తెలిపారు. కానీ దాన్ని 40 ఏళ్లకు పరిమితం చేయాలని కోరారు. శిక్ష పడకపోతే మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని చివరకు న్యాయమూర్తి 25 ఏళ్లు జైలు శిక్షను కుదించారు.