»Savitri Jindal Former Minister Who Resigned From Congress Party
Savitri Jindal: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Savitri Jindal: సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన కుటుంబ సభ్యుల సలహా మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హిసార్ ఎమ్మెల్యేగా పది సంవత్సరాలుగా ప్రజలకు, రాష్ట్రానికి నిస్వార్థంగా సేవ చేశానన్నారు. తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సావిత్రి జిందాల్ కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈక్రమంలో ఆమె కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
నవీన్ జిందాల్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కురుక్షేత్ర లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సావిత్రి జిందాల్ భర్త విమాన ప్రమాదదంలో మరణించిన తర్వాత ఆమె హిసార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత క్యాబినేట్ మంత్రిగా కూడా నియామకమయ్యారు. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు టాప్ ప్లేస్లోనే ఉంటుంది. ఈమె నికర విలువ దాదాపు రూ.2.47 లక్షల కోట్లు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 56వ స్థానంలో ఉన్నారు.