AP: కర్నూలు జిల్లా గోనెగండ్లలో దారుణం జరిగింది. ఇద్దరు కొడుకులు, కూతురు కలిసి కన్న తండ్రి కాళ్లు విరగొట్టారు. మంతరాజు, ఆదిలక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా ఇంకా ముగ్గురికి పెళ్లి కావాల్సి ఉంది. అయితే తండ్రి వారికి పెళ్లి చేయకుండా, వచ్చిన సంబంధాలు చెడుగొడుతున్నాడనే కోపంతో కాళ్లు విరగొట్టారు. ప్రస్తుతం అతను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.