బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై నమోదైన అట్రాసిటీ కేసును రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో నటి శిల్పా శెట్టి వాల్మీకులను ఉద్దేశిస్తూ కించపరిచే విధంగా భంగా అనే పదాన్ని ఉపయోగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. దీంతో అట్రాసిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా శెట్టికి బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. 2017లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ పదాన్ని ఉపయోగించినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది.