ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బోర్డ్ నుంచి వైదొలిగిన కో ఫౌండర్ బిన్నీ బన్సాల్ తాజాగా డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే బోర్డు నుంచి కూడా నిష్క్రమించారు. బిన్నీ బన్సాల్ వైదొలగడంపై స్పందించిన ఫోన్‌పే సీఈఓ, ఫౌండర్ సమీర్ నిగమ్ ఫోన్‌పే తొలినాళ్లలో ఎంతో మద్ధతిచ్చిన బిన్నీ బన్సాల్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అతని నిర్ణయాలు, విధానాలు సంస్థ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని తెలిపారు.