TG: హైదరాబాద్లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తిపై నమోదైన కేసు మూసివేసేందుకు ఎస్సై పవన్, కానిస్టేబుళ్లు సంతోశ్, రామకృష్ణ రూ.30 వేలు డిమాండ్ చేశారు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.