AP: తిరుపతి(D) సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్ సరస్సులో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. చల్లని వాతావరణంలో ఆహ్లదకరంగా తిరుగుతూ కనువిందు చేస్తున్నాయి. వేసవిలో విదేశీ పక్షులు ఎక్కువ సంఖ్యలో వచ్చి విడిది చేస్తాయి. వానలు కురుస్తూ వచ్చినప్పుడు వలస పక్షులు పులికాట్కు వస్తాయి. సెప్టెంబరర్ నుంచి మొదలయ్యే ఈ వలసతీర్ధం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. కాగా, వీటిని తిలకించేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.